mounamela noyee telugu song sagarasangamam

 మౌనమేల నోయీ - సాగర సంగమం

ఈ పాత వింటే మనసు ఆసాంతం ప్రశాంతమౌతుంది.

మీరు కోపంగా ఉన్నపుడు లేక బాధ తో ఉన్నపుడు కానీ అలజడి తో ఉన్నపుడు కానీ ఈ పాట వింటే 

మనసు తేలిక అవుతుంది.



ఈ పాట నేర్చుకోవాలనుకుంటే, క్రింద లిరిక్స్ ఉన్నాయి. 

సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి

**********************************

గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి

మౌనమేల నోయీ ఈ మరపు రాని రేయి

మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి
ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా
ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా
తారాడే హాయిలో..
ఇంత మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి

పలికే పెదవీ వణికింది ఎందుకో..
వణికే పెదవీ వెనకాల ఏమిటొ..
కలిసే మనసులా..విరిసే వయసులా
కలిసే మనసులా..విరిసే వయసులా

నీలి నీలి ఊసులూ లేత గాలి బాసలూ
ఏమేమో అడిగినా..
మౌన మేల నోయి ఈ మరపు రాని రేయి

హిమమే కురిసే చందమామ కౌగిటా..
సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిటా..
ఇవి ఏడడుగులా వలపూ మడుగులా..
ఇవి ఏడడుగులా వలపూ మడుగులా..

కన్నె ఈడు ఉలుకులూ కంటి పాప కబురులూ..
ఎంతెంతో తెలిసినా..

మౌన మేల నోయి ఈ మరపు రాని రేయి…
ఇంత మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి
ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా
ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా
తారాడే హాయిలో..
ఇంత మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి



 

Comments

Popular posts from this blog

lahe lahe Acharya chirannjeevi super song

Venu madhava | Nenunnanu | Telugu video song